: నలుగురు శాస్త్రవేత్తలకు బీఎం బిర్లా సైన్స్ అవార్డులు
భౌతిక, జీవ శాస్త్రాల్లో పరిశోధనలు చేస్తున్న నలుగురు ఔత్సాహిక శాస్త్రవేత్తలకు 2012 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక బీఎం బిర్లా సైన్స్ అవార్డులను అందజేస్తున్నట్టు సైన్స్ సెంటర్ సంచాలకుడు డాక్టర్ బిజి సిద్దార్థ తెలిపారు. సైన్స్, ఐటీ, విద్య పరిశోధనలకు సంబంధించి ఈ నెల 14 నుంచి 16 వరకు, 18 నుంచి 20 వరకు రెండు జాతీయ సింపోజియంలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన పలువురు శాస్త్రవేత్తలు హాజరుకానున్నారని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నలుగురు యువ శాస్త్రవేత్తలకు అవార్డుతో పాటు నగదు బహుమతి కూడా అందజేస్తామని ఆయన అన్నారు.