: సచిన్ చివరి వికెట్ కోసం విండీస్ బౌలర్లలో పోటీ నెలకొంది : స్యామీ


సచిన్ ను చివరిసారి పెవిలియన్ పంపడానికి విండీస్ బౌలర్లలో పోటీ నెలకొందని వెస్టిండీస్ కెప్టెన్ డారెన్ స్యామీ తెలిపాడు. సచిన్ ను చివరిసారి ఔట్ చేసే బౌలర్ పేరు చరిత్రలో నిలిచిపోతుందని తామంతా భావిస్తున్నామని అన్నాడు. ఏ ఫార్మాట్ లో అయినా సచిన్ ను చివరిసారి ఔట్ చేసే బౌలర్ చరిత్రలో చోటు సంపాదిస్తాడని చెప్పాడు. భారత్ కే కాకుండా ప్రపంచ క్రికెట్ కే అంబాసిడర్ గా నిలచిన సచిన్ చివరి టెస్టులో... తాము పాలుపంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని స్యామీ తెలిపాడు.

  • Loading...

More Telugu News