: పాతబస్తీలో పటిష్ఠ బందోబస్తు
మొహర్రం సందర్భంగా ఈ నెల 15న హైదరాబాద్ పాతబస్తీలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నగర పోలీస్ కమీషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. షియా ముస్లింలు పాతబస్తీలో నిర్వహించే వూరేగింపులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీగా పోలీసులను మోహరిస్తున్నట్టు ఆయన తెలిపారు. పాతబస్తీలో వూరేగింపు సందర్భంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొనకుండా ట్రాఫిక్ మళ్లిస్తున్నారు.