: తెలంగాణకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం : కోదండరాం
తెలంగాణకు దక్కాల్సిన అధికారాలు, వనరులపై అన్యాయం జరిగితే ఊరుకోమని తెలంగాణ ఐకాస ఛైర్మన్ కోదండరాం అన్నారు. హైదరాబాద్ పై ఆంక్షలు విధిస్తే ఒప్పుకోమని హెచ్చరించారు. ఈ రోజు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీమాంధ్రకు ఎలాంటి ప్యాకేజీలు ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని కోదండరాం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ముఖ్యమంత్రి కట్టుబడి ఉండాలని అన్నారు. వైసీపీకి విలువలు లేవని కోదండరాం విమర్శించారు. సమన్యాయం అంటున్న చంద్రబాబు జీవోఎంకు లేఖ ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. పార్లమెంటులో బిల్లు పెట్టేటప్పుడు మరోసారి ఢిల్లీ వస్తామని చెప్పారు.