: రాముడు, కృష్ణుడులతో 'రామ్ లీలా'కి సంబంధం లేదు: సంజయ్ లీలా భన్సాలీ
'రామ్ లీలా' సినిమా పేరుకి రామాయణంలోని 'రామ్ లీలా'తో కానీ, భారతంలోని 'రాస్ లీలా'తో కానీ సంబంధం లేదని ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెలిపారు. 'రామ్ లీలా' సినిమాను విలియం షేక్స్ పియర్ రచించిన 'రోమియో అండ్ జూలియట్' నవల ఆధారంగా రూపొందించామని భన్సాలీ స్పష్టం చేశారు. మితిమీరిన శృంగారం, అశ్లీలతతో హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా 'రామ్ లీలా' సినిమా ఉందని, తక్షణం దానిని నిలిపివేయాలని ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై స్పందించిన సంజయ్ లీలా భన్సాలీ భారతీయ ఇతిహాసాలతో ఈ సినిమాకు సంబంధం లేదని వెల్లడించారు. ఈ సినిమాలోని సన్నివేశాలు హిందువుల మనోభావాలను అగౌరవపరిచే విధంగా కానీ, మత విశ్వాసాలను దెబ్బతీసేలా కానీ లేవని భన్సాలీ చెప్పారు.