: టీ.బిల్లు ముందుకు వెళ్లదనే నమ్మకం మాకుంది: అశోక్ బాబు


శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పార్లమెంటుకు వస్తుందని ఓ వైపు కేంద్రం ఘంటాపథంగా చెబుతుంటే, ఏపీఎన్జీవోలు మాత్రం తెలంగాణ బిల్లు ముందుకు వెళ్లదనే నమ్మకం తమకుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు అన్యాయం జరగకుండా చూడాలనేదే తమ ఉద్దేశమని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. బిల్లు వచ్చాక దానిపై చర్చిస్తామన్నారు. కాగా, విభజనపై జేడీఎస్, జేడీయూ, సీపీఐ నేతలను కలిశామని.. విభజనను వ్యతిరేకిస్తామని మాజీ ప్రధాని దేవెగౌడ చెప్పారని అన్నారు. అసెంబ్లీలో బిల్లుకు వ్యతిరేకంగా సీమాంధ్ర ఎమ్మెల్యేలు అభిప్రాయాలు చెప్పాలని... ఇచ్చిన మాటకు ఎమ్మెల్యేలు కట్టుబడకపోతే ఉద్యమాన్ని మళ్లీ ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఒక ప్రాంతం కోసం మరో ప్రాంతానికి అన్యాయం చేయడం సబబు కాదన్నారు. విభజన క్రమంలో రాజ్యాంగ ఉల్లంఘన జరిగితే తాము కచ్చితంగా వ్యతిరేకిస్తామని అశోక్ బాబు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News