: రచ్చబండలో సిగరెట్ తాగిన ఆనం వివేకా.. అరెస్టు చేయాలని టీడీపీ డిమాండ్


నెల్లూరు జిల్లాలోని గ్రామీణ మండలం గుడిపల్లిపాడులో మూడో విడత రచ్చబండ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి సిగరెట్ తాగడంపై.. టీడీపీ నగర అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ కార్యక్రమమైన రచ్చబండలో విద్యార్థుల పక్కన కూర్చొని వివేకా సిగరెట్ తాగడాన్ని ఖండిస్తూ... తక్షణం ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బహిరంగ ధూమపాన వ్యతిరేక చట్టం అమలులో ఉందని ఆయన గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News