: విభజన విషయంలో కాంగ్రెస్ కు ద్వంద్వ వైఖరి లేదు: బొత్స
రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ కు ద్వంద్వ వైఖరి లేదని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. సీడబ్య్లూసీ నిర్ణయాన్ని గౌరవిస్తూనే.. పార్టీల నేతలు తమ ప్రాంతాల అభిప్రాయాలను చెబుతున్నారన్నారు. ముసాయిదా బిల్లు అసెంబ్లీకి వచ్చాక కూడా ఎమ్మెల్యేలు ఆయా ప్రాంతాల ప్రజల అభిప్రాయాలు చెబుతారని పేర్కొన్నారు. కాగా, కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేను తాను రహస్యంగా కలవలేదని వివరణ ఇచ్చారు. విభజన నేపథ్యంలో రెండు వేర్వేరు పీసీసీల గురించి వస్తున్న వార్తలు తనకు తెలియవని చెప్పారు.