: సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ పై మావోల మెరుపుదాడి
ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు మరోసారి సీఆర్పీఎఫ్ జవాన్లపై విరుచుకుపడ్డారు. సుకుమా జిల్లా తమెళ్ వాడలోని సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపుపై ఈ రోజు మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. మావోల దాడిని సీఆర్పీఎఫ్ బలగాలు దీటుగా ఎదుర్కొంటున్నాయి. ఛత్తీస్ గఢ్ లో తొలివిడత ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఊపిరి పీల్చుకుంటున్న భద్రతాదళాలపై మావోలు ఆకస్మికదాడులకు పాల్పడుతున్నారు. సుకుమా జిల్లాలో ఎన్నికల విధులు ముగించుకుని వస్తున్న బీఎస్ఎఫ్ జవాన్ల వాహనాన్ని మందుపాతర పెట్టి పేల్చారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు, డ్రైవర్ మృతి చెందిన సంగతి తెలిసిందే.