: మోడీకి లతా మంగేష్కర్ శుభాకాంక్షలపై వివాదం
గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని ఎన్నికల అభ్యర్ధి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ ప్రముఖ గాయని లతా మంగేష్కర్ గతనెల శుభాకాంక్షలు తెలపడంపై వివాదాలు ముసురుకున్నాయి. భారతరత్న అవార్డు గ్రహీత అయిన వ్యక్తి ఓ మతతత్వ వాదిని ప్రశంసించడం విచారకరమని ముంబై కాంగ్రెస్ అధ్యక్షుడు జనార్ధన్ చందూర్కర్ ఆరోపించారు. ఆమె తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అయితే, ఇక్కడ లతా మంగేష్కర్ పేరును ప్రస్తావించకుండానే జనార్ధన్ ఈ వ్యాఖ్యలు చేశారు.