: టీవీ సీరియళ్లు భారత సంస్కృతిని దిగజార్చాయి: దర్శకుడు అదూర్ గోపాలకృష్ణన్
టెలివిజన్ ధారావాహికలపై ప్రముఖ మలయాళ దర్శకుడు అదూర్ గోపాలకృష్ణన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత టెలివిజస్ రంగం దేశ సంస్కృతీ సంప్రదాయాలను దిగజార్చిందని వ్యాఖ్యానించారు. 19వ కోల్ కతా అంతర్జాతీయ సినీ పండుగ ఉత్సవాల నాలుగో రోజున మాట్లాడిన అదూర్ పైవిధంగా కామెంట్ చేశారు. ప్రస్తుతం ప్రసారమవుతున్న హాస్య కార్యక్రమాలు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా లేవన్నారు. సినిమా అనేది అద్భుతమైన కళ అన్నారు. దర్శకుడు కావడం అంత తేలిక కాదని, యువ దర్శకులు థియేటర్ రంగం నుంచి ఎంతో నేర్చుకోవాలని ఆయన సూచించారు.