: సల్మాన్ జైలు శిక్షపై రాజస్థాన్ హైకోర్టు స్టే


బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు స్థానిక కోర్టు విధించిన ఐదేళ్ల జైలు శిక్షపై రాజస్థాన్ హైకోర్టు స్టే విధించింది. దాంతో, బ్రిటన్ వీసా పొందేందుకు ఆయనకు అడ్డంకులు తొలగిపోయాయి. 1998లో వన్య ప్రాణులను వేటాడిన నేరంపై 2006లో రాజస్థాన్ లోని ఓ కోర్టు ఈ శిక్ష విధించింది. మరోవైపు నాలుగేళ్ల కంటే ఎక్కువ జైలు శిక్ష అనుభవించిన వారు బ్రిటన్ వీసా పొందేందుకు అనర్హులు. ఈ నేపథ్యంలో సల్మాన్ కు జైలు శిక్ష పడినప్పటి నుంచి బ్రిటన్ దౌత్య కార్యాలయం వీసా నిరాకరిస్తూ వస్తోంది. దాంతో, సల్మాన్ కింది కోర్టు తీర్పును పై కోర్టులో సవాల్ చేశాడు.

  • Loading...

More Telugu News