: అంతర్జాతీయ మోటారు వాహనాల ప్రదర్శన
ఓపక్క చిట్టి పొట్టి కార్లు ... మరోపక్క పడవల్లాంటి కార్లు... కళ్ళు జిగేల్ మనిపించే రంగురంగుల కార్లు ... ప్రపంచంలోని అన్ని రకాల కార్లు ఒక చోట చేరి ఠీవీ ఒలకబోస్తున్నాయి. 83వ అంతర్జాతీయ మోటార్ షో దీనికి వేదికైంది. స్విట్జర్లాండు లోని జెనీవా నగరంలో ఈ ప్రదర్శన ప్రారంభమైంది.
130 దేశాలకు చెందిన 260 కంపెనీలకు చెందిన వివిధ రకాల కొత్త మోడళ్ల కార్లు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత రోల్స్ రాయిస్, బీఎండబ్ల్యు, రేనాల్డ్ తదితర కంపెనీల ఉత్పత్తులతో ఈ ప్రదర్శన చూడముచ్చటగా వుంది.