: బాంబు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి అరెస్టు
హైదరాబాద్ లో పలుచోట్ల బాంబులు ఉన్నట్లు ఫోన్ చేసిన ఆగంతకుడిని పోలీసులు అరెస్టు చేశారు. సచివాలయం, శాసన సభ, బిర్లామందిరంలలో బాంబులు ఉన్నాయంటూ ఫోన్ రావడంతో సైఫాబాద్ పోలీసులు శనివారం నగరంలో విస్తృతంగా సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.
బాంబులేమీ లేవని తేలటంతో ఫోన్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలించారు. సెల్ ఫోను సిగ్నల్ ఆధారంగా ఈ ఫోన్ చేసింది మెదక్ జిల్లా వడియారం గ్రామానికి చెందిన నవీన్ గా పోలీసులు గుర్తించారు. తాగిన మైకంలో ఫోను చేసినట్లు నిందితుడు చెప్పడం కొసమెరుపు.

- Loading...
More Telugu News
- Loading...