: నత్త రోబోలొస్తున్నాయి


మనిషి ఆకారంలో రోబోలను శాస్త్రవేత్తలు తయారుచేశారు. ఇంకా పలు రకాల ఆకారాల్లో కూడా రోబోలను తయారుచేశారు. ఇప్పుడు చిన్న చిన్న జీవుల తరహాలో ఉండే రోబోలను శాస్త్రవేత్తలు తయారుచేస్తున్నారు. ఇలాంటి తరహాలో తయారుచేసిందే నత్తలాంటి రోబో.

మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు నత్తలాగా గోడలపై పాకగలిగిన, పైకప్పులకు, గోడలకు అంటిపెట్టుకుని ఉండగలిగిన రోబోలను అభివృద్ధి చేశారు. ఈ రోబోలు నత్తల్లాగా అన్ని వైపులకు వెళ్లగలవు. ఎలాంటి ఉపరితలాలపైనైనా అంటిపెట్టుకుని ఉండగలవు. ఇలా ఉండడానికి కారణం నత్త శరీరంలో ఉండే జిగురు లాంటి పదార్ధం. ఈ పదార్ధం ఆధారంగా చేసుకుని పరిశోధకులు నత్తలాంటి రోబోను అభివృద్ధి చేశారు. కేవలం నత్తేకాదు... కొన్ని రకాలైన పురుగులు, చేపలను కూడా ఆధారంగా చేసుకుని కొత్తరకం రోబోలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు.

  • Loading...

More Telugu News