: సీఎం కిరణ్ కు ఏమీ తెలీదు: చంద్రబాబు
రాష్ట్రంలో పరిస్థితులు క్షీణించడానికి సీఎం కిరణ్ కుమార్ రెడ్డే కారణమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కిరణ్ కు పాలన గురించి ఏమీ తెలియదని బాబు ఎద్దేవా చేశారు. ప్రస్తుతం బాబు కృష్ణా జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తన కుటుంబానికి రాష్ట్రాన్నే దోచిపెట్టారని బాబు అన్నారు. అవినీతికి, దోపిడీకి వైఎస్ మారుపేరులా నిలిచారని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. యువతను పీడిస్తున్న నిరుద్యోగ సమస్య రూపుమాపుతామని తెలిపారు.