: ఈ మందుతో 'కిక్కు' మాత్రమే వస్తుంది
మందుతో కిక్కు రాక మరేమొస్తుంది? అని మీ సందేహమా. మామూలు మందుతో కిక్కు రావడంతోబాటు కొన్ని రోజులకు సదరు మందు దేవత మనల్ని దాసోహం చేసుకుంటుంది. కొన్నాళ్లకు మన ఆరోగ్యాన్ని క్షీణించేలా చేస్తుంది. ఇలా కాకుండా మన ఆరోగ్యంపై ఎలాంటి చెడు ప్రభావాన్ని చూపకుండా కేవలం కిక్కును మాత్రమే ఇచ్చే కొత్త రకం మందును శాస్త్రవేత్తలు తయారుచేశారు.
లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీ ప్రొఫెసర్ డేవిడ్ నట్ ఒక కొత్తరకం మందును తయారుచేశారు. ఈ మందును వేసుకుంటే అచ్చు మందు తాగినట్టే ఉంటుంది. కానీ దీనివల్ల మామూలు మందు తాగడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు అనేవి రావు. అంతేకాదు... మామూలు మందుకు బానిసలైనట్టుగా దీనికి బానిస కావడం అనేది కూడా ఉండదు. ఇలాంటి కొత్తరకం మందును మార్కెట్లోకి తీసుకురావాలని డేవిడ్ నట్ ఆలోచిస్తున్నారు. దీనికి ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయని, ఎవరైనా పెట్టుబడిదారులు ముందుకొస్తే ఈ మందును పెద్ద ఎత్తున తయారుచేయవచ్చని ఆయన చెబుతున్నారు.