: విలేకరుల ముసుగులో నకిలీ నోట్ల చెలామణీ
ముగ్గురు వ్యక్తులు విలేకరులమంటూ చెప్పుకుని నకిలీ నోట్లు చెలామణీ చేస్తూ పోలీసులకు పట్టుబడిన ఘటన హైదరాబాద్ లో ఈ రోజు చోటు చేసుకుంది. నగరంలోని కాలాపత్తర్ పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. దాదాపు రూ. 30 లక్షల విలువైన దొంగనోట్లను వీరి వద్ద నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.