: రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం : చంద్రబాబు
రైతులకు ఇచ్చే పరిహారాన్ని పెంచాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. రైతులను, వరద బాధితులను ప్రభుత్వం ఆదుకునే వరకు ధర్నాలు చేపడతామని తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో మేధో మథనం ముగింపు సందర్భంగా చంద్రబాబు ప్రసంగించారు . తెలంగాణ ప్రాంతంలో కూడా పంటలన్నీ దెబ్బతిన్నాయని అన్నారు. అయినా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదని విమర్శించారు. రాష్ట్రంలోని రైతులను ప్రభుత్వం పూర్తిగా మరచిపోయిందని మండిపడ్డారు. రైతులకు న్యాయం జరిగే వరకు టీడీపీ పోరాడుతుందని చెప్పారు.
రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం తీరుపై ఢిల్లీ వెళ్లి నిరసన తెలుపుతామని చంద్రబాబు హెచ్చరించారు. తెదేపా పాలనలో రాష్ట్రాన్ని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లామని అన్నారు.