: సచిన్ మ్యాచ్ ప్రత్యక్షంగా వీక్షించనున్న బాలీవుడ్ తారలు.. షారూఖ్ మిస్


భారత, వెస్టిండీస్ మధ్య ఈ నెల 14 నుంచి 18 వరకు ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగనున్న మ్యాచ్ కు బాలీవుడ్ తారలు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. సచిన్ చివరి మ్యాచ్ కావడంతో బాలీవుడ్ తారలు తప్పనిసరిగా ఈ మ్యాచ్ తిలకించనున్నారు. అమీర్ ఖాన్, రణ్ బీర్ కపూర్, షాహిద్ కపూర్, వరుణ్ ధావన్, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తదితరులు మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించనుండగా, బాలీవుడ్ బాద్షా షారూఖ్ మాత్రం మ్యాచ్ ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లేదు.

కారణం ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా వాంఖడే స్టేడియంలో షారూఖ్, సెక్యూరిటీ గార్డుల మధ్య జరిగిన వాగ్వాదమే! ఆ సందర్భంగా షారూఖ్ మరోసారి వాంఖడేలోకి అడుగుపెట్టనని అన్నారు. ముంబై క్రికెట్ అసోసియేషన్ కూడా షారూఖ్ పై నిషేధం విధించింది. దీంతో సచిన్ 200వ టెస్టు మ్యాచ్, రిటైర్మెంట్ కు షారూఖ్ దూరంగా ఉండనున్నారు. ఈడెన్ గార్డెన్ లో మ్యాచ్ చూసేందుకు సన్నాహాలు చేసుకున్న షారూఖ్ ఆ మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగియడంతో ప్రత్యక్షంగా సచిన్ ఆటను చూడలేకపోయాడు.

  • Loading...

More Telugu News