: ఛత్తీస్ గఢ్ సర్కారుపై సోనియా విమర్శలు
ఛత్తీస్ గఢ్ సర్కారుపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు ఛత్తీస్ గఢ్ లోని భిలాయ్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన సోనియా.. ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో రమణ్ సింగ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వ్యాఖ్యానించారు. ప్రధానంగా భద్రత వ్యవస్థ అత్యంత దారుణంగా ఉందన్నారు. ఛత్తీస్ గఢ్ యువతకు ఉపాధి కల్పించాలని యూపీఏ ప్రభుత్వం వివిధ పథకాలు రూపొందించినా, రాష్ట్రంలో అభివృద్ధి దారుణంగా పడిపోవడంతో తమ ప్రయత్నాలన్నీ అడవి కాచిన వెన్నెలైందన్నారు. ఆదివాసీలు సొంతగడ్డపైనే హక్కును కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.