: ఈ నెల 25 న ఆరుషి కేసుపై తీర్పు
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీనేజ్ బాలిక ఆరుషి హత్య కేసులో న్యాయస్థానం ఈ నెల 25న తీర్పు వెలువరించనుంది. తాము నిర్ధోషులమంటూ ఆరుషి తల్లిదండ్రులు ఈ రోజు చివరిసారి న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. 2008లో 14 ఏళ్ల ఆరుషి తన గదిలోనే హత్యకు గురైంది. మరుసటి రోజు వారింట్లో పనిచేసే హేమరాజ్ మృతదేహం కూడా అదే భవనం డాబాపై లభ్యమైంది. దీంతో దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ ఈ జంట హత్యల్లో నిందితులు దంత వైద్యులైన ఆరుషి తల్లిదండ్రులే అని తేల్చింది. కేసును విచారించిన న్యాయస్థానం ఈ నెల 25న తీర్పు వెలువరించనుంది.