: హైదరాబాద్, సికింద్రాబాద్ శాంతి భద్రతలపై చర్చించాం: డీజీపీ


విభజన తర్వాత హైదరాబాదులో సీమాంధ్రుల రక్షణ, స్థానికంగా చెలరేగే ఆందోళనలకు సంబంధించి డీజీపీ ప్రసాదరావు సమీక్ష నిర్వహించారు. నగరంలోని జూబ్లీ హాలులో హైదరాబాదు, సైబరాబాదు కమిషనర్లు, ఇతర సీనియర్ పోలీసు అధికారులతో డీజీపీ సమావేశం నిర్వహించారు. జంట నగరాల శాంతి భద్రతలు, ఉగ్రవాదం, భవిష్యత్ లో తలెత్తబోయే ఆందోళనలు, ఉద్యమాలకు సంబంధించి సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే, పోలీసు శాఖకు సంబంధించి ఆంటోనీ కమిటీకి తాము నివేదిక పంపలేదని స్పష్టం చేశారు. హైటెక్ సిటీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగినుల రక్షణకు సంబంధించి ఐటీ కంపెనీలు ఎవరికి వారే కాల్ సెంటర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించినట్లు డీజీపీ వెల్లడించారు.

  • Loading...

More Telugu News