: దేశ భద్రతకే భరోసా లేదు.. సీమాంధ్రులకి భద్రతిస్తారా?: ధూళిపాళ్ల
కాంగ్రెస్ పార్టీ పాలనలో దేశ భద్రతకే భరోసా ఇవ్వని ప్రధాని... సీమాంధ్రుల భద్రతకు భరోసా ఇస్తామనడం హాస్యాస్పదమని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో ఆయన మాట్లాడుతూ, తమిళ పార్టీల ఒత్తిడితో ప్రధాని మన్మోహన్ సింగ్ శ్రీలంక పర్యటనే రద్దు చేసుకున్నారని ఎద్దేవా చేశారు. తెలుగువారి ఆత్మగౌరవం కాపాడాలని తీవ్ర ఉద్యమం జరుగుతున్నా ప్రధాని ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. రెండుసార్లు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికార పీఠంపై కూర్చోడానికి కారణమైన రాష్ట్ర ఎంపీలు... ఇప్పుడు కేంద్రాన్ని యాచించడం సిగ్గు చేటని ఆయన విమర్శించారు.