: అధిష్ఠానాన్ని ధిక్కరిస్తే కఠిన శిక్షలు తప్పవు: వీహెచ్
కాంగ్రెస్ పార్టీలో అధిష్ఠానాన్ని ధిక్కరిస్తే కఠిన శిక్షలు తప్పవని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ హెచ్చరించారు. చైన్నైలో ఆయన మాట్లాడుతూ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై అధిష్ఠానం చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో 15 లోక్ సభ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆయన అన్నారు. విభజనకు మద్దతు తెలిపిన కొన్ని పార్టీలు యూటర్న్ తీసుకున్నాయని ఆయన మండిపడ్డారు. సీఎం సమైక్యవాదినంటూ బహిరంగంగా చెప్పడాన్ని ఆయన తప్పు పడుతున్నారు.