: గుజరాత్ అల్లర్ల కేసులో మాజీ మంత్రికి బెయిల్
గుజరాత్ అల్లర్ల కేసులో ఆ రాష్ట్ర మాజీ మంత్రి మాయా కొద్నానీకి గుజరాత్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కొంతకాలం నుంచి ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో మెడికల్ గ్రౌండ్స్ లో కోర్టు బెయిల్ ఇచ్చింది. ఆమె చికిత్స తీసుకునేందుకు అనుమతించింది. 2002లో గుజరాత్ లోని నరోడ పాటియా ఊచకోతలో 97 మంది హత్యకు గురయ్యారు. ఈ దారుణ ఘటనపై తీవ్ర ఆరోపణలు రావడంతో భజరంగ్ దళ్ నేత బాబు భజరంగి, కొద్నానీలపై కేసు నమోదైంది. అనంతరం కోర్టు వారిని దోషులుగా ప్రకటించింది. దాంతో, గతేడాది ఆగస్టులో కోర్టు ఆమెకు 18 సంవత్సరాల జీవితకాల శిక్ష విధించింది.