: చీమూ నెత్తురుంటే సీఎం పదవిలో కిరణ్ కొనసాగరాదు : ఈటెల
ముఖ్యమంత్రి కిరణ్ పై తెరాస నేత ఈటెల రాజేందర్ మరోసారి విరుచుకుపడ్డారు. చీమూ నెత్తురుంటే ఒక క్షణం కూడా సీఎం పదవిలో కిరణ్ కొనసాగరాదని ఘాటుగా వ్యాఖ్యానించారు. సీమాంధ్రకు అనుకూలంగా ఉంటూ... తెలంగాణలో రచ్చబండ కార్యక్రమానికి ఎలా వస్తారని విమర్శించారు. పది జిల్లాలు, హైదరాబాద్ తో కూడిన తెలంగాణే తమకు కావాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ పై కేంద్రం పెత్తనం చేయాడానికి తాము ఒప్పుకోమని ఈటెల అన్నారు.