: విజయవంతంగా మామ్ కక్ష్య పొడిగింపు
భారత్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నింగిలోకి పంపిన మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్) ఉపగ్రహం ఈ రోజు విజయవంతంగా 1,18,000 కిలోమీటర్ల అంగారక కక్ష్య వైపు దూసుకెళ్లింది. మంగళవారం ఉదయం 5.03 గంటలకు 303.8 సెకెన్ల బర్న్ టైం లో ఉపగ్రహ వేగాన్ని 124.9 మీటర్లు/సెకన్ కు పెంచగలిగామని ఇస్రో తెలిపింది. ఇదే సమయంలో ఉపగ్రహం అపోజీని 78,276 కిలో మీటర్ల నుంచి 1,18,642 కిలో మీటర్లకు పెంచినట్టు ప్రకటించింది. నవంబర్ 16న మరోసారి ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఉపగ్రహ అపోజీని లక్ష 92 వేల కిలోమీటర్లకు పెంచుతారు. అనంతరం డిసెంబర్ 1న ఉపగ్రహాన్ని అంగారక గ్రహం వైపు ప్రయాణించేలా చేస్తారు.