: నేడు తెదేపా రెండో రోజు మేధో మథనం


ఈ రోజు ఉదయం 10 గంటలకు తెదేపా మేధో మథనం రెండో రోజు సదస్సు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ప్రారంభం కానుంది. ఈ సదస్సులో సమర్థ నాయకత్వం, రాష్ట్ర పరిస్థితులను చక్కదిద్దుట, ఇతర పార్టీల దుష్ప్రచారాన్ని ఎలా ఎదుర్కోవాలి? అనే అంశాలపై రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రసంగిస్తారు. అనంతరం, మధ్యాహ్నం కేంద్రంలో, రాష్ట్రంలో అవినీతి, సమస్యల వలయంలో ప్రజలు, అసమర్థ కాంగ్రెస్ పాలన అంశాలపై రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. సాయంత్రం, వివిధ పార్టీల డిక్లరేషన్లు, వాటి ప్రాధాన్యతలపై సీతక్క ప్రసంగించనున్నారు. అనంతరం, సాయంత్రం 6 గంటలకు చంద్రబాబు మేధో మథనం ముగింపు సందేశం ఇస్తారు.

  • Loading...

More Telugu News