: ఢిల్లీలో నాలుగు సార్లు కంపించిన భూమి


దేశ రాజధాని ఢిల్లీలో నిన్న అర్ధరాత్రి 12.41 గంటలకు భూమి స్వల్పంగా కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.1గా నమోదయింది. మూడు గంటల వ్యవధిలో వరుసగా నాలుగు సార్లు భూమి కంపించింది. ఒక్కో కంపనం మూడు నుంచి నాలుగు సెకన్ల పాటు సంభవించింది. దీంతో ఢిల్లీవాసులు భయాందోళనకు గురయ్యారు. భూకంప కేంద్రం దక్షిణ ఢిల్లీలోని సైనిక్ ఫార్మ్స్ ప్రాంతంలో, భూమికి 10 కిలోమీటర్ల లోపల కేంద్రీకృతమై ఉన్నట్టు వాతావరణశాఖ తెలిపింది.

  • Loading...

More Telugu News