: అభిమాని కుటుంబానికి చిరంజీవి సహాయం
కేంద్రమంత్రి, మెగాస్టార్ చిరంజీవి తన గొప్ప మనసును చాటుకున్నారు. అభిమానులంటే తనకెంత ప్రీతో మరోసారి రుజువు చేశారు. గత నెలలో పాలెంలో జరిగిన వోల్వో బస్సు ప్రమాదంలో చిరంజీవి అభిమాన సంఘం కర్ణాటక అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ మృతి చెందిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళం తన అభిమాని ప్రమాదంలో మృతి చెందారని తెలుసుకుని చిరంజీవి కలత చెందారు. ఈ రోజు వెంకటేష్ యాదవ్ కుటుంబానికి 5 లక్షల రూపాయల డీడీని తమ్ముడు నాగబాబు ద్వారా పంపించారు. అతని కుటుంబానికి ఏ రకమైన సహాయం కావాల్సి వచ్చినా తామున్నామని భరోసా ఇచ్చారు. పిల్లలను బాగా చదివించాలని నాగబాబు వారికి సూచించారు.