: భద్రత కారణాల రీత్యా 'బాద్ షా' ఆడియో రిలీజ్ 17కు వాయిదా!
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వస్తున్న 'బాద్ షా' చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం వాయిదా పడింది. ఈ నెల 17న ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని సమాచారం. వాస్తవానికి ఈ ఆడియో ఫంక్షన్ ఈ నెల 10 న జరగాల్సి ఉంది.
అయితే, ఉగ్రదాడులు జరగొచ్చని కేంద్రం ఈరోజు ఉదయం హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ దినేశ్ రెడ్డి విజ్ఞప్తి మేరకు, ఈ పాటల విడుదల కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు తెలుస్తోంది. బండ్ల గణేశ్ ఈ భారీ చిత్రానికి నిర్మాత.