: సోనియాకు రోశయ్య సలహాలు?


తమిళనాడు గవర్నర్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య నుంచి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ రాష్ట్రానికి సంబంధించిన కీలక సమాచారం రాబడుతున్నట్లు ఢిల్లీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణ అంశం, రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళిన విషయం తెలిసిందే. కాకతాళీయంగా రోశయ్య కూడా దేశ రాజధానిలోనే ఉండటం ఈ చర్చలకు ఆస్కారం ఇస్తోంది. 

రాష్ట్ర కాంగ్రెసు పార్టీలో సీనియర్ నేతగా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం రోశయ్యది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడ్డ సమయంలో ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయనకు సమగ్ర అవగాహన ఉంది. దీంతో తెలంగాణ అంశంపై ఎలాంటి చర్యలు చేపట్టాలనే విషయంపై సోనియాగాంధీ, రోశయ్యతో చర్చించినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News