: జీవోఎంను కలిసేందుకు ఢిల్లీకి క్యూ కట్టిన నేతలు
జీవోఎంను కలిసేందుకు పలు పార్టీలకు చెందిన నేతలు ఢిల్లీకి క్యూ కట్టారు. సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, జెల్లి విల్సన్ లు ఢిల్లీ వెళ్లారు. మరో వైపు బీజేపీ నుంచి జీవోఎంను కలిసేందుకు హరిబాబు ఢిల్లీలోనే మకాం వేశారు. వీరు రేపు జీవోఎం ముందు తమ వాదనలు వినిపించనున్నారు. కాగా, వైఎస్సార్ సీపీ నుంచి ఎంవీ మైసూరా రెడ్డి, గట్టు రామచంద్రరావు ఢిల్లీ వెళ్లనున్నారు. టీడీపీ జీవోఎంను బహిష్కరించనుంది. ఎంఐఎం ఇప్పటికే నివేదిక సమర్పించగా, టీఆర్ఎస్ నుంచి కేసీఆర్, కేకే బయలుదేరి వెళ్లారు. సీపీఎం విభజనకు వ్యతిరేకం కనుక జీవోఎంను కలిసేది లేదని స్పష్టం చేసింది.