: టీఆర్ఎస్ వల్లే తెలంగాణ ఏర్పాటు: నాయిని
తమ త్యాగాల వల్లే తెలంగాణ ఏర్పడిందని టీఆర్ఎస్ నేత నాయిని నర్శింహారెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ పై ఏదైనా కిరికిరి పెడితే సహించేది లేదని అన్నారు. 1969 కంటే ఉద్ధృతమైన ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. హైదరాబాద్ పై సీమాంధ్రుల పెత్తనం ఉంటే తెలంగాణ ఏర్పడినా ప్రయోజనం లేదని అన్నారు.