: విభజనపై ఉన్నతాధికారులతో మంత్రుల బృందం విస్తృత చర్చలు
రాష్ట్ర విభజనపై వివిధశాఖల ఉన్నతాధికారులతో మంత్రుల బృందం విస్తృత చర్చలు జరుపుతోంది. పాలన సిబ్బంది, హోం మంత్రిత్వ శాఖ అధికారులతో మంత్రుల బృందం చర్చిస్తోంది. ఉదయం నుంచి 8 మంత్రిత్వ శాఖలకు చెందిన అధికారుల నుంచి జీవోఎం వివరాలు సేకరిస్తున్నట్టు సమాచారం. జల వనరులు, బొగ్గు, సహజవాయువు, విద్యుత్ శాఖ, ప్రణాళికా సంఘం, విద్య, వైద్య, ఆరోగ్య శాఖల అధికారుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, జైరాం రమేష్, గులాం నబీ ఆజాద్ లు ఉదయం నుంచి మంతనాల్లో మునిగిపోయారు.