: తిరుమల భక్తులకు ఉచిత లడ్డూ ఇవ్వాలని టీటీడీ నిర్ణయం
తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల పట్ల కాస్త కనికరం చూపించింది. తిరుమలకు నడిచి వచ్చే భక్తులకు ఉచిత లడ్డూ ఇవ్వనుంది. అటు శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం ఇవ్వాలని నిర్ణయించింది. శాశ్వత ఉద్యోగులకు రూ.10వేలు, తాత్కాలిక ఉద్యోగులకు రూ.5 వేలు కానుకగా ఇవ్వనుంది. విష్ణు నివాసం, శ్రీనివాసం, మాధవం అతిధి గృహాల్లో భక్తులకు త్వరలో అన్నప్రసాద కార్యక్రమం చేపట్టనుంది. ఇక లడ్డూ ధర యథాతథంగా ఉంటుందని, నాణ్యత పెంపుపై కృషి చేస్తామని టీటీడీ పాలకమండలి తెలిపింది. తిరుచానూరులో రూ.3.75 కోట్లతో శ్రీనివాస ఆలయం పునరుద్ధరించనున్నారు. మహామణి మండపం నిర్మాణంపై ఉన్నత స్థాయి కమిటీ వేయాలని, మిరాసి అర్చకులకు పరిమితి ఎత్తివేయాలని ఈ రోజు జరిగిన పాలకమండలి సమావేశంలో టీటీడీ నిర్ణయం తీసుకుంది.