: మరింత బలంగా వాదనలు వినిపిస్తాం: తెలంగాణ కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్ రెవెన్యూ పంపకాలు, శాంతిభద్రతలు, గవర్నర్ పాలనపై రాజీపడబోమని తెలంగాణ కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. జీవోఎం ముందు మరింత బలంగా తమ వాదనలు వినిపించాలని వారు నిర్ణయించారు. సీడబ్యూసీ నిర్ణయం ప్రకారమే విభజన జరగాలని, తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాల్సిందేనని తెలంగాణ కాంగ్రెస్ నేతలు కోరారు. ఈ నెల 14న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు ఢిల్లీ వెళ్లనున్నారు.