: బర్త్ డే పార్టీలో సరదా కోసం కాల్పులు.. ఇద్దరు మృతి


అమెరికాలో తుపాకుల సంస్కృతి పెరిగిపోయింది. ఓ బర్త్ డే పార్టీలో సరదా ఇద్దరి ప్రాణాలు తీయడమే కాకుండా మరో 18 మందిని గాయపరిచింది. టెక్సాస్ రాష్ట్రంలోని హూస్టన్ లో శనివారం రాత్రి ఓ ఇంటిలో 18 ఏళ్ల అమ్మాయి బర్త్ డే పార్టీ జరిగింది. దీనికి సుమారు వంద మంది హాజరయ్యారు. వీరిలో ఎక్కువ శాతం 18-19 ఏళ్ల వారే కావడం విశేషం. పార్టీ మధ్యలో ఓ వ్యక్తి సరదా కోసం తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపాడు. దీంతో మరో వ్యక్తి తమపై ఎవరో కాల్పులు జరుపుతున్నారని కంగారుపడి కాల్పులు వినిపించిన సమూహం వైపు కాల్పులు జరిపాడు.

దీంతో పార్టీలో పాల్గొన్న వారు ప్రాణాలు రక్షించుకునేందుకు రెండో అంతస్తు కిటికీల నుంచి దూకేశారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. చాలామంది విద్యార్థులు గాయాలపాలయ్యారు. దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. గాయపడ్డవారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

  • Loading...

More Telugu News