: సీబీఐ చట్టబద్దత అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తాం: ప్రధాని
సీబీఐ చట్టబద్దత అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తామని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తెలిపారు. ఢిల్లీలోని విజ్ఞానభవన్ లో మూడు రోజుల పాటు జరుగనున్న సీబీఐ అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ సీబీఐ చట్టబద్దతపై ఇటీవలి కాలంలో అనేక ప్రశ్నలు తలెత్తాయని గుర్తు చేశారు. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం కూడి నిశితంగా పరిశీలించాలని ఆయన కోరారు. సీబీఐ అవసరాన్ని తెలిపేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. సీబీఐ భవిష్యత్తును కాపాడేందుకు కృషి చేస్తామని ప్రధాని పేర్కొన్నారు.