: ఐపీఎల్ అవకతవకలపై ప్రీతీ జింటాను ప్రశ్నించిన ఈడీ


ఐపీఎల్ రెండో సీజన్ లో చోటు చేసుకున్న పలు ఆర్దిక అవకతవకలపై ఈడీ ఈ రోజు బాలీవుడ్ నటి ప్రీతీ జింటాను ప్రశ్నించింది. సుమారు 6 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ విచారణలో ఈడీ అధికారులు తమ ప్రశ్నలతో ప్రీతీ జింటాను ఉక్కిరిబిక్కిరి చేసినట్టు సమాచారం.

ఐపీఎల్ ఫ్రాంచైజీ కింగ్స్ లెవెన్ పంజాబ్ కు ప్రీతీ సహ యజమానిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, 2009లో దక్షిణాఫ్రికాలో నిర్వహించిన ఐపీఎల్ రెండో సీజన్ సందర్బంగా టోర్నీలోకి వెల్లువెత్తిన ధన ప్రవాహం పలు అనుమానాలకు తావిచ్చింది. పన్ను రహిత దేశాల నుంచి దక్షిణాఫ్రికాకు పెద్ద ఎత్తున సొమ్ము తరలడంపై ఈడీ వెంటనే దృష్టి సారించింది.

కింగ్స్ లెవెన్ జట్టుకు కూడా ఆర్ధిక అవకతవకలకు సంబంధం ఉందేమోనన్న కోణంలో ఈడీ అధికారులు తమ విచారణ కొనసాగిస్తున్నారు. ఈడీ ఇంతకుముందే బీసీసీఐ మాజీ చీఫ్ శశాంక్ మనోహర్, కోల్ కతా నైట్ రైడర్స్ సహ యజమాని షారూఖ్ ఖాన్ తో పాటు మాజీ క్రికెటర్ రవిశాస్త్రిలను ప్రశ్నించింది. 

  • Loading...

More Telugu News