: ఐదు రోజుల క్రితం అదృశ్యమైన యువకుడు దారుణ హత్య
ఐదు రోజుల క్రితం అదృశ్యమైన హైదరాబాద్ పటాన్ చెరు మండలం అమీన్పూర్ వీఆర్వో మల్లేశం కుమారుడు అనిల్ కుమార్ హత్యకు గురైయ్యాడు. మెదక్ జిల్లా జిన్నారం మండలం ఐడీఏ బొల్లారం శివారులో ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఈ రోజు ఉదయం అతని మృతదేహాన్ని కనుగొన్నారు. సమాచారం తెలుసుకున్న పటాన్ చెరు, ఐడీఏ బొల్లారం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇప్పటికే అనిల్ కుమార్ అదృశ్యమైనట్టు కేసు నమోదు చేసిన పోలీసులు హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేసారు.