: రోజుకు మూడు లీటర్లు నీరు తాగితే చాలు


ఎక్కువ నీటిని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని మనకు చాలామంది చెబుతున్నా మనలో ఎక్కువమంది నీరు తాగరు. ముఖ్యంగా మహిళలు, అందునా బయట ఉద్యోగాలు చేసేవారు ఎక్కువగా బాత్రూం సమస్య ఉంటుందని నీటిని తక్కువగా తీసుకుంటారు. ఇలాంటి వారిలో రకరకాల ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువేనని చెప్పవచ్చు. అయితే తక్కువ నీటిని తీసుకోవడం వల్ల త్వరగా వయసు ఛాయలు కనిపిస్తాయట. అదే ఎక్కువ నీటిని తాగడం వల్ల వయసు వేగానికి కళ్లెం వేయవచ్చని చెబుతున్నారు.

బ్రిటన్‌కు చెందిన 42 ఏళ్ల వయసున్న సారా కొంతకాలం క్రితం కళ్లకింద క్యారీబ్యాగుల్లాగా వదులుగా వేలాడే చర్మంతో ఉండేది. అప్పుడు సారా రోజూ ఉదయం ఒకగ్లాసు, మధ్యాహ్నం ఒకగ్లాసు, రాత్రిపూట ఒక గ్లాసు ఆహారం తీసుకునే సమయంలో నీటిని తీసుకునేదట. తర్వాత నీటి ప్రాముఖ్యతను గురించి అర్థం చేసుకున్న సారా రోజుకు మూడు లీటర్ల నీటిని తీసుకోవడం మొదలుపెట్టిందట. దీంతో కళ్లకింద వదులుగా వేలాడుతున్న చర్మం చక్కగా బిగుతుగా తయారయ్యిందట. కేవలం వారం రోజుల్లోనే తన ముఖంలో మంచి మార్పు కనిపించిందని, తన పిల్లలు కూడా తనను చూసి ఆశ్చర్యంతో నోరు తెరిచారని సారా చెబుతోంది. నీటిని తీసుకోవడం వల్ల బోలెడు ప్రయోజనాలుంటాయని ఇప్పటికైనా గ్రహిస్తారా... నీరు మన శరీరంలోని మలినాలను బయటికి నెట్టివేయడంలో చక్కగా తోడ్పడుతుంది. కాబట్టి చక్కగా రోజుకు కనీసం మూడు లీటర్ల నీటిని తాగడం ఈరోజు నుండే ప్రారంభించండి మరి...!

  • Loading...

More Telugu News