: మెదడుకు చిన్న రంధ్రం చాలు...


మెదడులో కణితి ఏర్పడితే ఏం చేస్తారు... పెద్ద ఆపరేషను చేసి ఏర్పడిన కణితిని వైద్యులు తొలగిస్తారు. దీనివల్ల ఎక్కువ సమయం పడుతుంది. అలా కాకుండా చిన్న రంధ్రం చేసి మెదడులోని కణితిని తొలగించగలిగితే... దీనికి పెద్దగా సమయం కూడా పట్టదు. గంటకన్నా తక్కువ సమయం పట్టే ఈ సరికొత్త వైద్య విధానాన్ని పరిశోధకులు విజయవంతంగా ఒక రోగికి నిర్వహించారు కూడా.

అమెరికాకు చెందిన ర్యాన్‌ అనే 44 ఏళ్ల వ్యక్తి మెదడులో ఉన్న కణితిని హ్యూస్టన్‌ మెథడిస్ట్‌ హాస్పిటల్‌ న్యూరోసర్జన్లు ఈ సరికొత్త విధానం ద్వారా విజయవంతంగా తొలగించారు. అత్యంత సన్నగా ఉండే ఒక గొట్టం ద్వారా వైద్యులు మెదడులోని కణితిని తొలగించారు. ఇలాంటి విధానంలో శస్త్ర చికిత్స చేయడం ఈ ప్రాంతంలో ఇదే మొదటిసారి అని హ్యూస్టన్‌ మెథడిస్ట్‌ న్యూరోలాజికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో న్యూరోసర్జరీ ఛైర్మన్‌ గవిన్‌ బ్రిట్జ్‌ చెబుతున్నారు. సాధారణంగా మెదడులో ఉండే ఇలాంటి కణితులను తొలగించడానికి శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని, కానీ ఈ సరికొత్త చికిత్స ద్వారా మెదడుకు చిన్న గాయం చేసి కణితిని తొలగించవచ్చని గవిన్‌ చెబుతున్నారు. ఈ శస్త్ర చికిత్సకు గంటకన్నా కూడా తక్కువ సమయం పట్టిందని, శస్త్ర చికిత్స జరిగిన మరుసటి రోజే ఆ వ్యక్తి ఇంటికి వెళ్లిపోయారని గవిన్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News