: అక్బరుద్దీన్ పై మరో కేసు
వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఆదిలాబాద్ జిల్లా జైలులో రిమాండు ఖైదీగా ఉన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై హైదరాబాదులోని మంగళ్ హాట్ పోలీసుస్టేషన్ లో మరో కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్ 295(ఎ), 298 కింద ఈ కేసులు నమోదయ్యాయి. 16వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో టీడీపీ కార్పోరేటర్ రాజాసింగ్ లోథ్ ప్రైవేటు ఫిర్యాదు ఇచ్చారు. దీనిపై స్పందించిన కోర్టు అక్బరుద్దీన్ పై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.