: భారత్, రష్యా, చైనాల త్రైపాక్షిక చర్చలు కాసేపట్లో ప్రారంభం
ప్రపంచ దేశాల్లో అత్యంత కీలకమైన భారత్, రష్యా, చైనాల మధ్య త్రైపాక్షిక చర్చలు ఈ సాయంత్రం ఢిల్లీలో ప్రారంభం కానున్నాయి. ఈ భేటీలో మూడు దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు పాల్గొంటారు. ఈ చర్చల్లో ఆర్థికాభివృద్ధి, తీవ్రవాదం, మాదకద్రవ్యాల సరఫరాలతో పాటు పలు కీలకాంశాలపై చర్చించనున్నారు. ఈ భేటీకి ముందు భారత విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్... రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి లతో ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో వేర్వేరుగా సమావేశమవుతారు. ఇప్పటి వరకు మూడు దేశాల మధ్య 11 సార్లు త్రైపాక్షిక చర్చలు జరిగాయి. గత ఏడాది ఈ సమావేశం మాస్కోలో జరిగింది.