: జగన్ ను వైఎస్ హైదరాబాద్ నుంచి బహిష్కరించింది నిజం కాదా? : వర్ల రామయ్య


అవినీతిలో పీకల్లోతు కూరుకుపోయిన జగన్ ను అతని తండ్రి వైఎస్ హైదరాబాద్ నుంచి బహిష్కరించిన విషయం నిజం కాదా? అని తెదేపా నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. జగన్ ఓ కోర్టు పక్షి అని వర్ల విమర్శించారు. ఎన్టీఆర్ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ వర్ల రామయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు భ్రష్టు పట్టాయని జగన్ అనడం... దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని విమర్శించారు. బెంగళూరు, కోల్ కతా వెళ్లడానికి కోర్టు అనుమతిని జగన్ కోరడం... కేవలం సూట్ కేస్ కంపెనీలను ప్రభావితం చేయడానికేనని వర్ల దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News