: ఆదాయం పంచుకోవడానికి తెలంగాణ ప్రజలు ఇష్డపడరు: నారాయణ
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను కేంద్రం సజావుగా సాగనివ్వడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. తిరుపతిలో ఆయన మీడియాతో మట్లాడారు. హైదరాబాద్ ఆదాయం సీమాంధ్రతో పంచుకోవడానికి తెలంగాణ ప్రజలు ఇష్టపడరన్నారు. సీమాంధ్ర మంత్రులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం అధిష్ఠానానికి గులాములుగా మారారని ఆయన విమర్శించారు.