: హైదరాబాద్ ఆదాయాన్ని పంచడానికి ఒప్పుకోం : కేటీఆర్


హైదరాబాద్ రెవెన్యూని ఇరు ప్రాంతాలకు సమానంగా పంచడాన్ని తాము వ్యతిరేకిస్తామని తెరాస నేత కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ పై రూ. 50 వేల కోట్లు ఖర్చు చేశామంటున్నారని... అదే నిజమైతే దానిపై శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో సీమాంధ్రులు తమ సొంత ఆస్తులనే అభివృద్ధి చేసుకున్నారని విమర్శించారు. సీమాంధ్ర నేతలు హైదరాబాద్ పై తప్పుడు సమాచారం ఇస్తూ, కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. తెరాస ఉద్యమ ఫలితమే తెలంగాణ రాష్ట్రమని... అయితే, దాన్ని తామే సాధించామని తెలంగాణ కాంగ్రెస్ నేతలు డబ్బా కొట్టుకుంటున్నారని దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News