: స్టీల్ ప్లాంట్ కార్మికుడికో న్యాయం.. సింగరేణి కార్మికుడికో న్యాయమా..?: హరీష్ రావు


సర్కారు.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కార్మికుల పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గని కార్మికులపై సవతి ప్రేమ చూపుతోందని ఆయన విమర్శించారు.

విశాఖలోని స్టీల్ ప్లాంట్ కార్మికుడు చనిపోతే రూ. 20 లక్షలు పరిహారం ప్రకటిస్తున్న ప్రభుత్వం సింగరేణి కార్మికుడు మరణిస్తే కేవలం రూ. 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటోందని చెప్పారు. ఎవరిదైనా ప్రాణమే అంటూ, సింగరేణి కార్మికులకు సైతం రూ. 20 లక్షల పరిహారం చెల్లించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.  

  • Loading...

More Telugu News